నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలో సోమవారం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధానంగా శంకర్‌నగర్, దీప్తీశ్రీనగర్లలో రోడ్లపైకి పెద్దమెత్తంలో వరద నీరు వచ్చి చేరింది. చందానగర్ సర్కిల్ ఏఈ అనురాగ్ మహదేవ్‌తో కలసి డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రెడ్డి రఘునాథ్‌రెడ్డి ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. జీహెచ్ఎంసీ సిబ్బంది చేపడుతున్న సహాయక చర్యలను వారు పర్యవేక్షించారు. వరదనీరు నుంచి తొలిగిపోయేలా సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.