శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): సేవా పక్షం – 2025 సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు జరిగే కార్యక్రమాలలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మసీద్ బండ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సేవా పక్షం జిల్లా కన్వీనర్ రాధాకృష్ణ యాదవ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17, ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా యువ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టనున్న నిషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా 3k నమో యువ రన్ పోస్టర్ ఆవిష్కరించారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు సేవా పక్షం 2025 కార్యక్రమాలను ప్రతి బూత్ స్థాయికి చేర్చాలని, రక్తదాన శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో బిజెపి పట్ల నమ్మకాన్ని పెంపొందించాలన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ సేవా పక్షం కేవలం పార్టీ కార్యక్రమం మాత్రమే కాదు, ప్రజలకు చేరువ కావడానికి ఒక అవకాశమని తెలిపారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం బిజెపి మాత్రమే ప్రత్యామ్నాయం అని ఈ కార్యక్రమాలు నిరూపిస్తాయని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి మాట్లాడుతూప్రతి కార్యకర్త తన వంతు సేవ చేయాలని, సేవ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడం బిజెపి లక్ష్యం అని పేర్కొన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు,సేవాపక్షం జిల్లా కన్వీనర్ రాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ సేవా పక్షం కార్యక్రమాలు సమాజానికి చేరువ కావడానికి ఒక మహత్తరమైన అవకాశమని, ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి సేవా కార్యక్రమాలను అందించాలని, రక్తదానం, పర్యావరణ పరిరక్షణ, పేదల సంక్షేమం వంటి సేవా కార్యక్రమాల ద్వారా బిజెపి ప్రజల గుండెల్లో స్థానం సంపాదిస్తోందన్నారు.

అనంతరం నూతనంగా ఎన్నికైన బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుండే గణేష్ ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మూల అనిల్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షురాలు స్రవంతి, కార్యదర్శులు దుర్గాప్రసాద్, మణిభూషణ చారి, మాణిక్ రావు, కోశాధికారి కృష్ణంరాజు, సేవాపక్షం జిల్లా కో కన్వీనర్ కుమార్ యాదవ్ , డివిజన్ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, బి జె వై ఎమ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.





