శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్ జిహెచ్ఎంసి కార్యాలయం, గంగారాం, హుడా కాలనీ, జనప్రియ అపార్ట్మెంట్, ఓల్డ్ హఫీజ్ పేట్ తో పాటు పలు చోట్ల 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీజేపీ హఫీజ్ పేట్ డివిజన్ కంటెస్టడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది తమ ప్రాణాలను, కుటుంబాలను లెక్కచేయకుండా పోరాడి స్వాతంత్ర్య తీసుకువచ్చారని ఆ ప్రతిఫలాలను కాపాడుకుంటూ మనం భావితరాలకి అందించాలని అన్నారు. ఈ దేశంలో ఎటువంటి బేధభావాలు లేకుండా సమసమాజ నిర్మాణానికి మనం అందరం కృషిచేయాలని, ఏ వృత్తిలో ఉన్నపటికీ దేశ ఔన్నత్యాన్ని కాపాడే విధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు దేవల్ యాదవ్, కోటేశ్వరరావు, శ్రీధర్, అజిత్, దుర్గా నరేందర్, జితేందర్, రాజు యాదవ్, పవన్, శ్రీనివాస్ యాదవ్, బాబు రెడ్డి, నవీన్, పాలం శ్రీను, సలీం, రామారావు, శ్రీనివాస్, శివ రాం, జుధిస్థిర, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






