శేరిలింగంపల్లి, డిసెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): బతుకు తెరువు కోసం వలస వచ్చిన కూలీలకు, భిక్షాటన చేస్తూ రోడ్లపై నివసిస్తున్న వారికి సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యుడు, ట్రస్ట్ చైర్మన్ భిక్షపతి యాదవ్ ఉచితంగా దుప్పట్లు పంపిణీ చేశారు. మానవసేవే , మాధవసేవ అంటూ నిత్యం ఏదో ఒక సామాజిక సేవ చేస్తూ ప్రజలకు అండగా ఉంటున్న సందయ్య మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ భిక్షపతి యాదవ్ నల్లగండ్ల పరిసర ప్రాంతాలలో వలస కూలీలకు, భిక్షాటన చేస్తూ రోడ్లపై నివసిస్తున్న పేదవారికి ఉచితంగా దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీస అవసరాలు తీర్చుకోలేని దుస్థితిలో ఉన్న పేద ప్రజలు తీవ్రమైన చలి నుండి రక్షించుకోవడానికి ఉచితంగా దుప్పట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరు తమకు తోచిన విధంగా సమాజ సేవ చేస్తూ పేదవారికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ కార్పొరేటర్ ఎల్లేష్, వసంత్ యాదవ్, కిషోర్ ముదిరాజ్, సురేష్, ప్రభాకర్, సతీష్, ఫారూఖ్, మరియా తదితరులు పాల్గొన్నారు.






