శేరిలింగంపల్లి, జనవరి 11 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు చోట్ల రాత్రి పూట రహదారుల పక్కన పడుకుని నిద్రిస్తున్న యాచకులు, పేదలకు ఆయువ్ స్టూడెంట్స్ యూత్ ఫౌండేషన్ (ASYF) అండగా నిలిచింది. వారికి ASYF నాయకులు దుప్పట్లను పంపిణీ చేశారు. నియోజకవర్గం పరిధిలోని లింగంపల్లి, మదీనాగూడ, గంగారం, ఆల్విన్ కాలనీ, మియాపూర్, హఫీజ్‌పేట, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, మసీదుబండ రోడ్డు తదితర ప్రాంతాల్లో సుమారుగా 220 మందికి దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ASYF వ్యవస్థాపకుడు రోహిత్ ముదిరాజ్, సభ్యులు భాను ముదిరాజ్, శ్రీనివాస్, సంతు ముదిరాజ్, స్వరూప్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.






