శేరిలింగంపల్లి, డిసెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ జేపీ నగర్ కాలనీ కమాన్ వద్ద రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని GHMC కార్మికుల కోసం సీనియర్ నాయకుడు గణేష్ ముదిరాజ్ ఏర్పాటు చేసిన దుప్పట్లను బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుందని, రోజు పొద్దున్న లేచి నగర పరిశుభ్రత కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్మికుల పట్ల మన బాధ్యతను గుర్తు చేస్తూ, వారి సేవలకు గౌరవాన్నివ్వడం, అండగా నిలవడమే మన కర్తవ్యమని గుర్తుచేస్తూ వారికి అండగా నిలుస్తూ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టిన గణేష్ ముదిరాజ్ ని అభినందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మాణిక్ రావు, మాజీ కన్వీనర్ రాఘవేంద్ర రావు, డివిజన్ అధ్యక్షుడు ఆకుల లక్ష్మణ్, సీనియర్ నాయకులు రాజేష్ గౌడ్, శ్రీనివాస్, వినోద్ యాదవ్, విజయేందర్, శివరాజ్, శివారెడ్డి, రాము, బాషా, శివ, సోను, నాగులు, కాలనీ వాసులు సుమన్, మహేష్, జిహెచ్ఎంసి కార్మికులు పాల్గొన్నారు.






