శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): బీజేవైఎం రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన బీజేవైఎం రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు పవన్ ని సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు లంగటి నరేందర్ రెడ్డి హాజరై పవన్ ని అభినందించారు. బీజేపీని బలోపెతం చేసే విధంగా పనిచేయాలని అన్నారు. పార్టీ ప్రతి కార్యక్రమంలో శేరిలింగంపల్లి యువ మోర్చా నాయకులు సహకరిస్తూ అధ్యక్షుడికి వెన్నుదన్నుగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు హరికృష్ణ, నందనం విష్ణు దత్, చంద్రమోహన్, హరిప్రియ, అసెంబ్లీ నాయకులు క్రాంతి, శివ, వెంకట్, గంగాధర్, భార్గవ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.






