జీవో 135ను ర‌ద్దు చేయాలి: బీజేపీ నాయ‌కుల డిమాండ్

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న 135 జీవోను వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని బీజేపీ నాయ‌కులు డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం బీజేపీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం ఎదుట ఆ పార్టీ నాయ‌కులు నిరసన తెలిపారు. అనంత‌రం జీవో నం.135ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ స్థానిక జీహెచ్ఎంసీ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కి వినతిపత్రం అంద‌జేశారు.

నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్న బీజేపీ నాయ‌కులు

ఈ సంద‌ర్భంగా బీజేపీ శేరిలింగంపల్లి నియోజకవర్గ కన్వీనర్ పోరెడ్డి బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు ప్ర‌జ‌లు క‌రోనాతో బాధ‌ప‌డుతుంటే మ‌రోవైపు ప్ర‌భుత్వం ఎల్ఆర్ఎస్ ను తెచ్చి ప్ర‌జ‌ల‌ను మ‌రిన్ని ఇబ్బందుల‌కు గురి చేస్తుంద‌ని, ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల ప‌రిస్థితి మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ చందంగా మారింద‌ని అన్నారు. ఈ జీవో వ‌ల్ల పేద ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నార‌ని తెలిపారు. రాష్ట్ర అత్యున్న‌త న్యాయ‌స్థానం కూడా ఈ జీవోపై తీవ్ర వ్యాఖ్య‌లు చేసింద‌ని, క‌నుక ప్ర‌భుత్వం ఈ విష‌యంపై పున‌రాలోచ‌న చేయాల‌ని డిమాండ్ చేశారు.

శేరిలింగంపల్లి జోన‌ల్ కార్యాల‌యం ఎదుట నిర‌స‌న తెలుపుతున్న నాయ‌కులు

బీజేపీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గజ్జల యోగానంద్ మాట్లాడుతూ.. గతంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ల‌లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఆమోదించిన లేఅవుట్లు ఇప్పుడు అక్రమమనే వాదన లోప భూఇష్టమైంది, అనాలోచితమైనది అని అన్నారు. ఈ విష‌యం ప్రజలను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తుంద‌ని అన్నారు. ఈ జీవో 135 కేవలం అక్రమంగా ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేయడం కోసం మాత్రమే ఉపయోగపడుతుంద‌ని, వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు.

డిప్యూటీ క‌మిష‌న‌ర్‌కు విన‌తిప‌త్రం అంద‌జేస్తున్న బీజేపీ నేతలు

బీజేపీ రాష్ట్ర నాయకుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ.. ప్ర‌భుత్వం రాష్ట్ర ఖ‌జానాను నింపుకునేందుకే ఎల్ఆర్ఎస్‌ను తెచ్చింద‌ని, కానీ అది స‌హేతుకం కాద‌ని అన్నారు. డ‌బ్బే ప్ర‌ధానం అనుకుంటే ప‌లు ఇత‌ర మార్గాల ద్వారా కూడా ఖజానాను నింపుకోవ‌చ్చ‌ని అన్నారు. ప్ర‌భుత్వం ప్ర‌జ‌లు మేలు చేసే ప‌నులు చేయాలికానీ, వారిపై మోయ‌లేనంత భారం మోప‌డం స‌రికాద‌ని అన్నారు. ప్రజా ప్రయోజనాల రీత్యా రాష్ట్ర హైకోర్టు చేసిన తీవ్రమైన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని ఈ అనాలోచిత నిర్ణయన్ని రద్దు చేయాలని బీజేపీ శేరిలింగంపల్లి డిమాండ్ చేస్తుంద‌ని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు నాగేశ్వర్ గౌడ్, మనోహర్, రాజేంద్ర ప్రసాద్ దూబే, రాజశేఖర్, జిల్లా నాయకులు వసంత్ కుమార్ యాదవ్, గోవర్ధన్ గౌడ్, నరేందర్ ముదిరాజ్, నూనె సురేందర్, సురేష్, రవి గౌడ్, డివిజన్ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, మాణిక్యరావు, శ్రీధర్‌, జయరాములు ముదిరాజ్, రాజు, బీజేపీ యువ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ జితేందర్, ఐటీ సెల్ కన్వీనర్ కల్యాణ్, నాయకులు అజిత్, మారం వెంకట్, రాకేష్ దూబే, వర ప్రసాద్, నరేందర్ గౌడ్, ఆంజనేయులు సాగర్, శ్రీనివాస్ చారి, రెడ్డి ప్రసాద్, అనిల్ గౌడ్, చందు యాదవ్, ప్రశాంత్ చారి, బీజేవైఎం చంద్ర మోహన్, విష్ణు, నాయకురాళ్లు వినిత సింగ్, లలిత, హరి ప్రియ, రజని, నాయకులు రామకృష్ణారెడ్డి, ఈశ్వర్, తిరుపతి, చందు, ఆంజనేయులు, సురేష్ మట్ట, కిషన్, శ్రీనివాస్ ముదిరాజ్, బీజేవైఎం రాజేందర్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here