శేరిలింగంపల్లి, జనవరి 13 (నమస్తే శేరిలింగంపల్లి): నూతన డివిజన్ మదీనాగూడలో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలను కలుస్తూ బూత్ కమిటీలను పూర్తి స్థాయి కమిటీలుగా ఏర్పాటు చేసే విధంగా డివిజన్ ప్రధాన కార్యదర్శి రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో బూత్ దర్శన్ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకుడు నందనం విష్ణు దత్త్, మాజీ కౌన్సిలర్ రమణయ్య, పాలం శ్రీనివాస్ పాల్గొన్నారు. హుడా కాలనీ బూత్ 115 లో బూత్ అధ్యక్షుడు కుదుపూడి దుర్గ ప్రసాద్ ని కలసి వారు బూత్ స్థాయిలో చేస్తున్న సేవలకు గాను చిరు సత్కారం చేశారు. పూర్తి స్థాయిలో బూత్ కమిటీ పని చేసే విధంగా చూడాలని తెలియజేశారు.






