బిజెపి అభ్య‌ర్థి గెలుపుకోసం హ‌న్మ‌కొండ‌ చ‌ర్చీలో గచ్చిబౌలి కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి ప్ర‌త్యేక ప్రార్ధ‌న‌లు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేప‌థ్యంలో గచ్చిబౌలి డివిజ‌న్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి హన్మ‌కొండలో ప్ర‌చారం నిర్వ‌హించారు. 27వ వార్డు బిజెపి అభ్య‌ర్థి చింతాకుల అనిల్‌కుమార్ గెలుపుకోసం స్థానిక‌ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంత‌రం ఇంటింటికి తిరుగుతూ ప్ర‌చారం నిర్వ‌హించారు. బిజేపి అభ్య‌ర్థి అనిల్ కుమార్‌కి ఓటు వేయాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను అక్క‌డి ఓట‌ర్లకు ఆయ‌న వివ‌రించారు. గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ అభివృద్ధి బిజెపితోనే సాధ్య‌మ‌ని అన్నారు. ఇత‌రుల లాగా తాము వాగ్ధానాలు చేసి మ‌రిచిపోమ‌ని, ప్ర‌జ‌ల సంక్షేమ‌మే ల‌క్షంగా పాల‌న కొన‌సాగిస్తుమ‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, స్థానిక బిజెపి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

హ‌న్మ‌కొండ‌లోని చ‌ర్చిలో ప్రార్ధ‌న‌లు చేస్తున్న‌గంగాధ‌ర్‌రెడ్డి, అభ్య‌ర్థి చింతాకుల అనిల్‌కుమార్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here