నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి ఒక్కరూ భగవద్గీత ను చదివి సారాంశాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సామాజిక సేవా రత్న అవార్డు గ్రహీత భేరీ రామచందర్ యాదవ్ పేర్కొన్నారు. శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు స్వామి వారి దివ్య ఆశీస్సులతో బుధవారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీనగర్ లో బేరి రాంచందర్ యాదవ్ కు త్రైత సిద్ధాంత భగవద్గీత తోపాటు 100 ఆధ్యాత్మిక గ్రంథాలు అందజేశారు. ఈ సందర్భంగా రాంచందర్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భగవద్గీత దైవ గ్రంథాన్ని చదివి దేవుని ధర్మాలు తెలుసుకుని ఆచరిస్తే సమాజంలో జరుగుతున్న రుగ్మతలు తొలగిపోతాయని అన్నారు. నేతాజీనగర్ లో ప్రజలందరికి భగవద్గీత జ్ఞాన ప్రచారము చేసి ప్రతి ఇంట్లో భగవద్గీత గ్రంథము ఉండేలా ఏర్పాటు చేస్తామని చెప్పారు.