గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ జన్మదినం సందర్భంగా నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ స్థానిక షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు చేయించారు. ఆరెకపూడిగాంధీ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్న గాంధీకి సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వాలని అన్నారు. అనంతరం భేరి రామచందర్ యాదవ్ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అందెల కుమార్ యాదవ్, నేతాజీ నగర్ షిరిడి సాయిబాబా ఆలయ ప్రధాన అర్చకుడు జోషి రాఘవేంద్ర శర్మ, సాయి సేవకుడు ఆగయ్య గౌడ్, కార్యదర్శి టి.కుమార్ ముదిరాజ్, రజక సంఘం అధ్యక్షుడు నరేందర్, నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి భేరి శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.