శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 6 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ వాస్తవ్యుడు, ప్రముఖ సంఘ సేవకుడు , యువ వ్యాపార వేత్త రాచమల్ల భాస్కర్ గౌడ్ పుట్టినరోజు వేడుకలని మియాపూర్ యూత్ సభ్యులు, వివిధ పార్టీ నాయకుల సమక్షంలో మియాపూర్ ఆర్.బి.ఆర్ అపార్ట్ మెంట్స్ లోని రాచమల్ల భాస్కర్ గౌడ్ కార్యలయంలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. మొదటగా శాలువాతో సత్కరించి ఆయనచే కేక్ కట్ చేయించి అనంతరం ఆయనకి జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తాండ్ర రాంచందర్ గౌడ్, బండారు మహేందర్ ముధిరాజ్, యెల్లంకి శ్రీనివాస్ గౌడ్, మన్నె సురేష్ ముధిరాజ్, బండారు శ్రీనివాస్ ముధిరాజ్, యలమంచి ఉదయ్ కిరణ్, మన్నె విజయ్ ముదిరాజ్, దోర్నాల రవికుమార్ గౌడ్, నర్సింహ, చిరంజీవి ముదిరాజ్, సతీష్ పాల్గొన్నారు.