శేరిలింగంపల్లి, డిసెంబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజాపాలన విజయోత్సవం కార్యక్రమంలో భాగంగా మాదాపూర్ లోని శిల్పరామం దగ్గర మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విగ్రహం వద్ద సుందరికరించి అభివృద్ధి చేసిన జంక్షన్ ను షాద్ నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్, తెలంగాణ రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్ రెడ్డి రంగారెడ్డి, డీసీ మోహన్ రెడ్డి, డీసీ ముకుంద రెడ్డి, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు రఘునాథ్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సమ్మారెడ్డి, మంత్రి ప్రగడ సత్యనారాయణ రావు, శ్రీను, పింటు తదితరులు పాల్గొన్నారు.