ఏం సాధించార‌ని కాంగ్రెస్ సంబురాలు చేసుకుంటోంది: ర‌వికుమార్ యాద‌వ్

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన ఏ హామీని అమ‌లు చేయ‌లేద‌ని, ప్ర‌జ‌లు ఇప్పుడు అయోమ‌య స్థితిలో ఉన్నార‌ని బీజేపీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యుడు, శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ఇన్‌చార్జి ర‌వికుమార్ యాద‌వ్ అన్నారు. రాష్ట్ర నాయ‌క‌త్వం ఇచ్చిన పిలుపు మేర‌కు కాంగ్రెస్ అమ‌లు చేస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల‌ను నిర‌సిస్తూ శేరిలింగంపల్లి మండల తహసిల్దార్ కార్యాలయానికి పార్టీ ముఖ్య నాయకులతో ర్యాలీగా వెళ్లి రెవెన్యూ సూపరిండెంట్ కి విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ర‌వికుమార్ యాద‌వ్ మాట్లాడుతూ ఏం సాధించార‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం సంబ‌రాలు చేసుకుంటుంద‌ని విమ‌ర్శించారు. ప్ర‌జ‌ల‌కు అమ‌లు కాని హామీల‌ను ఎర‌గా చూపించార‌ని, వాళ్లు మాత్రం అధికార ప‌ల్ల‌కిలో ఊరేగుతున్నార‌ని అన్నారు. హైడ్రా, మూసీ ప్ర‌క్షాళ‌న అంటూ కాల‌యాప‌న చేస్తూ ప్ర‌జ‌ల దృష్టిని సీఎం రేవంత్ రెడ్డి మ‌ళ్లిస్తున్నార‌ని అన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డంలో చిత్త‌శుద్ధిని క‌న‌బ‌ర‌చాల‌ని అన్నారు.

శేరిలింగంప‌ల్లి మండ‌ల త‌హ‌సీల్దార్ కార్యాల‌యం ఎదుట నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న ర‌వికుమార్ యాద‌వ్, బీజేపీ నాయ‌కులు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్రావు, మణి భూషణ్, బుచ్చిరెడ్డి, నాగులు గౌడ్, మహిపాల్ రెడ్డి, ఎల్లేష్, రామ్ రెడ్డి, మాణిక్, శ్రీధర్ గౌడ్, భూపాల్ రెడ్డి, నరసింగరావు, ఆంజనేయులు సాగర్, నరసింహ చారి, గోపాల్ రావు, సీతారామరాజు, రాజేష్ గౌడ్, రమణయ్య, లక్ష్మణ్, మహేష్ , అజిత్, చంద్రశేఖర్ యాదవ్, శివ సింగ్ , వీరు యాదవ్, శాంతిభూషణ్, కోటేశ్వరరావు, రవి గౌడ్ , జితేందర్, శ్రీనివాస్ యాదవ్, విజయేందర్, పవన్ యాదవ్ , అరవింద్, జితేందర్ , పద్మ , మేరీ , వరలక్ష్మి, విజయలక్ష్మి, జ్యోతి, అనూష, క్రాంతి , కృష్ణ దాస్ , ఆంజనేయులు యాదవ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here