పెద్ద కుడి చెరువు సుందరీకరణ ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, మే 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్ పేట్ విలేజ్ పెద్ద కుడి చెరువు సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులలో భాగంగా చెరువులో మురుగు నీరు కలవకుండా చేపడుతున్న మురుగు నీటి మళ్లింపు పైపు లైన్ నిర్మాణం పనులను మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, ఇరిగేషన్ అధికారులు, CMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ చెరువు లో కలుషిత నీరు కలవకుండా చేపడుతున్న డ్రైనేజి వ్యవస్థ మళ్లింపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. డ్రైనేజి వ్యవస్థ మళ్లింపు పైపు లైన్ నిర్మాణం పనులను వేగం పెంచాలని, పనులు నాణ్యతా ప్రమాణాలతో చేప‌ట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు DE రాజశేఖర్, AE గులాం, CMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు AE ప్రశాంత్, వర్క్ ఇన్స్పెక్టర్ జగదీష్, CSR ప్రతినిధి చైతన్య, నాయకులు మారబోయిన రాజు యాదవ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ప్రతాప్ రెడ్డి, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here