శేరిలింగంపల్లి, మే 2 (నమస్తే శేరిలింగంపల్లి): ఈ నెల 10 వ తేదీన మహాత్మా జ్యోతిబాఫూలే ద్విశతాబ్ది జయంతి ఉత్సవాల సందర్భంగా 200 మంది కవులు, రచయితలతో బీసీ కవితా భేరిని విజయవంతం చేయాలని కోరుతూ శనివారం బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయంలో వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్స్ అయిలి వెంకన్న గౌడ్, యెలికట్టే విజయ్ కుమార్ గౌడ్, తెలుగు భాష చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు బడేసాబ్ , డా.పెబ్బేటి మల్లికార్జున్, ఐలన్ గౌడ్, నరేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.






