- బిసి నాయకులకు పిలుపునిచ్చిన ఆర్ కృష్ణయ్య, బేరి రామచంద్రర్ యాదవ్
శేరిలింగంపల్లి, నవంబర్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు సోమవారం దేశోద్ధారక భవన్ లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీసీ సంఘాల చైర్మన్ ఆర్ కృష్ణయ్య, బీసీ సంఘాల వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రాంచందర్ యాదవ్ మాట్లాడారు. మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ బీసీల వాటా దక్కే వరకు పోరాటం ఆగదని అన్నారు. సమావేశానికి హాజరైన బీసీ నేతలు తమ వాడ తమకు దక్కేంతవరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సమావేశం కార్యచరణ ఏర్పాటు చేసి ప్రణాళికను బిసి సంఘాలకు, బీసీ కుల సంఘాలకు తెలియజేశారు.

బీసీలు ఐకమత్యంగా ఉండాలని, స్థానిక ఎన్నికల్లో బీసీలు తమ ఓట్లతో తమ నాయకులను ఎన్నుకోవాలని అన్నారు. గ్రామాల నుండి పట్టణం వరకు ప్రజలు బీసీలకు మద్దతుగా ఉండాలన్నారు. అనేకమంది బీసీ నాయకులు, బీసీ కార్యకర్తలు 33 జిల్లాల నుండి పాల్గొని తమ తమ అభిప్రాయాలను ఆర్ కృష్ణయ్యకు తెలిపారు. ఈ విషయంపై ఆర్ కృష్ణయ్య స్పందిస్తూ ఉద్యమమే ఊపిరిగా పనిచేద్దామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోరాటం కొనసాగిద్దామని, కార్యాచరణలో పేర్కొన్న విధంగా కార్యక్రమాలను చేపడుదామని అన్నారు. రోడ్లను దిగ్భంధనం చేయడంతోపాటు నిరాహార దీక్షలు చేపడుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి వెంకటయ్య, వెంకటయ్య యాదవ్, వెంకట సుబ్బయ్య, నాగరాజు, హరికృష్ణ చారి, భట్టు రాజు, సాయన్న తదితరులు పాల్గొన్నారు.





