శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామంలో ఉన్న శ్రీ సిద్ధి వినాయక దేవాలయం గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా గణనాథుడి లడ్డూ వేలం పాటను నిర్వహించారు. మూడోసారి ఈ లడ్డూను పటాన్‌చెరు బీఆర్ఎస్ యువనాయకుడు బాలగౌని సాయిచరణ్ గౌడ్ సొంతం చేసుకున్నారు. ఇక్కడి లడ్డూను సాయిచరణ్ గౌడ్ 2023లో రూ.3,50,000 కు సొంతం చేసుకోగా, గత ఏడాది రూ.6,25,000 కు సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది మూడోసారి లడ్డూను రూ.7,00,000 కు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణనాథుడి లడ్డూ వరుసగా మూడోసారి తమ కుటుంబానికి దక్కడం తమ అదృష్టమని అన్నారు. ఇది స్వామివారి ఆశీర్వాదంగా భావిస్తున్నాం అని అన్నారు. ఉత్సవ సమితి సభ్యులు మాట్లాడుతూ సాయిచరణ్ గౌడ్ కుటుంబంపై ఎల్లప్పుడూ గణనాథుడి కృప ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం అని తెలిపారు.






