శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తారానగర్ ఏఈ రవిచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. డివిజన్ పరిధిలోని 11 కేవీ రాజీవ్ గృహ కల్ప ఫీడర్ పరిధిలో కరెంటు తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తున్నందున ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాజీవ్ గృహకల్ప, పాపిరెడ్డి కాలనీ, రాజీవ్ స్వగృహ ఫీడర్లలో, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు రాజీవ్ స్వగృహ, మార్కెట్ ఫీడర్ ప్రాంతాల్లో, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు లింగారెడ్డి ట్రాన్స్‌ఫార్మర్, చందానగర్ రైల్వే ట్రాక్స్ ప్రాంతాల్లో కరెంటు ఉండదని తెలిపారు.





