శేరిలింగంపల్లి అక్టోబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రముఖ సామాజిక వేత్త, ఏఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రేవంత్ రాజ్ బర్త్ డే వేడుకలను ఆయన అభిమానులు, ఫౌండేషన్ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఆయన 26వ జన్మదినాన్ని పురస్కరించుకుని లింగంపల్లి రైల్వేస్టేషన్ వద్ద సోమవారం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ను ఏర్పాటు చేశారు. హెల్త్ క్యాంప్ లో కేర్ హాస్పిటల్స్, స్మార్ట్ వీసీఎన్ఐ హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బంది పాల్గొని ఉచితంగా పలువురికి కంటి పరీక్షలు, కార్డియో, జనరల్ చెకప్స్ చేశారు. ఏఆర్ ఫౌండేషన్ సభ్యులు, పలువురు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఏఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రేవంత్ రాజ్ మాట్లాడుతూ..పేద ప్రజలను ఆదుకునేందుకు 2017లో ఫౌండేషన్ ను స్థాపించినట్లు తెలిపారు.
అప్పటి నుంచి ప్రతి ఏటా ఫౌండేషన్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అందులో భాగంగానే ఈసారి కూడా హెల్త్ క్యాంప్ తోపాటు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి చిన్నారులకు బహుమతులను ప్రదానం చేయడం ఆనందానిచ్చిందన్నారు. మున్ముందు కూడా ఫౌండేషన్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మెంబర్ సి.యాదగిరి గౌడ్, అమీన్ పూర్ మునిసిపల్ వైస్ ఛైర్మన్ నరసింహ గౌడ్,హోప్ ఫౌండేషన్ అధినేత కొండా విజయ్, సీనియర్ జర్నలిస్ట్ అనిల్, బీఆర్ఎస్ నాయకుడు రవికుమార్ యాదవ్, శేరిలింగంపల్లి కంటెస్ట్ కార్పొరేటర్ యెల్లేష్,శేరిలింగంపల్లి గ్రామ కమిటీ మాజీ అధ్యక్షుడు గోపాల్ ముదిరాజ్, బీజేపీ నాయకుడు రాజు శెట్టి, బీఆర్ఎస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు కృష్ణా యాదవ్, శ్రీనివాస్ రాజ్, సీనియర్ పాత్రికేయులు రాజేష్ గౌడ్, హేమంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శివ ముదిరాజ్, అనిల్ నాయక్, ఎస్. మల్లేష్ గౌడ్, ఎండీ ఖాజా, టీజీఎన్ ఛానెల్ ఎండీ సతీష్ ముదిరాజ్, ఏఆర్ ఫౌండేషన్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.