ఘ‌నంగా బోయిని అనూష మహేష్ యాదవ్ జ‌న్మ‌దిన వేడుక‌లు

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్ పేట్ వద్ద బీజేపీ హఫీజ్ పేట్ డివిజన్ కాంటెస్టడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ జన్మదినం సందర్భంగా ఓల్డ్ హఫీజ్ పేట్, హుడా కాలనీ, గంగారాం, చందానగర్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో బీజేపీ సీనియర్ నాయకులు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ క‌ట్ చేసి అనంతరం ఆహార ప్యాకెట్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రమణయ్య , బీజేపీ జిల్లా నాయకుడు రవి గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవ భావాన్ని పెంపొందించుకోవాల‌ని అన్నారు. ప్రతి ఒక్కరూ సేవాకార్యక్రమాలు చేపట్టి ప్రధాని నరేంద్ర మోదీ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ న‌డ‌వాల‌ని, అందరం ముందుండి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జగన్ గౌడ్‌, రాజు ముదిరాజ్, బాబు రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, పవన్, నర్సింహా యాదవ్, పాలం శ్రీనివాస్, నవీన్, దేవేందర్ దాస్, రాజేష్, రామారావు, సుబ్బారావు, వినయ్, రాజు, శ్రీను, రాములు, కుమార స్వామి, అనిల్, శివ, చందు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here