శేరిలింగంపల్లి, ఆగస్టు 9 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియపూర్ దీప్తి శ్రీనగర్‌లో ఉన్న శ్రీ ధర్మపురి క్షేత్రంలో వారాహి అమ్మవారి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భారతీయం సత్యవాణి ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, చండీ హోమాలు నిర్వహించారు. అలాగే శ్రీమన్నారాయణ స్వామి వారి పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో అనంత లక్ష్మి, రెజోనెన్స్ కాలేజ్ ఎండీ పూర్ణ చందర్ రావు, స్థానిక భక్తులు, పరిసర ప్రాంత వాసులు పాల్గొన్నారు.






