శేరిలింగంప‌ల్లి త‌హ‌సీల్దార్ కార్యాల‌యం ఎదుట బీజేపీ, బీజేవైఎం ధ‌ర్నా

శేరిలింగంప‌ల్లి‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వం నిరుద్యోగులు, ప్రైవేటు టీచ‌ర్ల‌ను నిర్ల‌క్ష్యం చేస్తూ వారికి తీవ్ర అన్యాయం చేస్తుంద‌ని బీజేపీ, బీజేవైఎం నాయ‌కులు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను, ప్రైవేట్ టీచర్స్ ను నిర్లక్ష్యం చేస్తూ వారికి తీవ్ర అన్యాయం చేస్తున్న కేసీఆర్ సర్కార్ వైఖరికి నిరసనగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ ఇచ్చిన‌ ధర్నా పిలుపు మేర‌కు శేరిలింగంపల్లి అసెంబ్లీ బీజేవైఎం కన్వీనర్ జితేందర్ ఆధ్వర్యంలో మంగ‌ళ‌వారం శేరిలింగంపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట‌ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా నాయ‌కులు త‌హ‌సీల్దార్ కార్యాల‌య అధికారికి విన‌తిప‌త్రం అంద‌జేశారు.

శేరిలింగంప‌ల్లి త‌హ‌సీల్దార్ కార్యాల‌యం ఎదుట ధ‌ర్నా నిర్వ‌హిస్తున్న బీజేపీ, బీజేవైఎం నాయ‌కులు

ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పోరెడ్డి బుచ్చిరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎం. రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జ్ఞానేంద్ర ప్రసాద్, బీజేపీ నాయకులు రాధాకృష్ణ యాదవ్, రఘునాథ్ యాదవ్, సింధు రెడ్డి, ఎల్లేష్, బీజేవైఎం నాయకులు హరికృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, హరిప్రియ, విష్ణు, బీజేపీ నాయకులు మనోహర్, నరేందర్ ముదిరాజ్, కృష్ణ ముదిరాజ్, మాణిక్యాల‌ రావు, బీజేవైఎం డివిజన్ అధ్యక్షుడు మధుసూదన్ రావు, సిద్దు, శివ కుమార్, క్రాంతి, నందు, అజయ్ కుమార్, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

త‌హసీల్దార్ కార్యాల‌యం అధికారికి విన‌తిప‌త్రం అంద‌జేస్తున్న నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here