శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 14 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్ధిక్ నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్నపూర్ణ స్వీట్ హౌస్ షాపును కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ప్రారంభించారు. అన్నపూర్ణ స్వీట్ హౌస్ షాపు యాజమాన్యం హనుమాన్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. కస్టమర్ల నమ్మకం పొందుతూ, మరిన్ని శాఖలుగా విస్తరించాలని ఈ సందర్బంగా ఆకాంక్షించారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిద్దిక్ నగర్ కాలనీ అధ్యక్షుడు బుడుగు తిరుపతి రెడ్డి, మాజీ అధ్యక్షుడు కాలే బసవరాజు, సీనియర్ నాయకులు నందు, యాదయ్య గౌడ్, గువ్వల రమేష్, సాగర్ చౌదరి, గణపతి, లక్ష్మి బాయి, సరోజ రెడ్డి, రవి, ఆనంద్ చౌదరి, శివ కుమార్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.





