శేరిలింగంపల్లి, డిసెంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఛత్రపతి శివాజీ నగర్ కాలనీకి చెందిన అంజయ్య యాదవ్ ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికలలో వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండలం కడిచర్ల గ్రామ పంచాయితీ నుండి పోటీ చేసి సర్పంచ్ గా విజయం సాధించిన సందర్బంగా కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అంజయ్య యాదవ్ ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, మరెళ్ల శ్రీనివాస్, నాగరాజు, రమణారెడ్డి, కోటేశ్వరరావు, అష్రాఫ్, చంద్రమోహన్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.






