నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లికి చెందిన ప్రముఖ వ్యాపారి మారబోయిన అనిల్ కుమార్ యాదవ్ తన తండ్రి కీర్తిశేషులు మారబోయిన సత్యనారాయణ యాదవ్ స్మృత్యర్థం అయోధ్య శ్రీ భవ్య రామమందిర నిర్మాణానికి రూ.5 లక్షల నిధి సమర్పణ చేశారు. శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర నిధి సమర్పణ అభియాన్ లో భాగంగా రూ.5 లక్షల చెక్కును మాజీ శాసనసభ్యులు ఎం బిక్షపతి యాదవ్, బిజెపి నాయకులు ఎం రవి కుమార్ యాదవ్ నేతృత్వంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సమక్షంలో ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ దేవేందర్ కు అందజేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మర్యాదా పురుషోత్తముడుకి తను పుట్టిన గడ్డపై ఎట్టకేలకు చేపడుతున్న మందిర నిర్మాణంలో తన వంతు భాగస్వామ్యాన్ని కూడగట్టడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశం కల్పించిన బిక్షపతి యాదవ్, రవికుమార్ యాదవులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.