శేరిలింగంపల్లి, మార్చి 27 (నమస్తే శేరిలింగంపల్లి): శ్రీరామ నవమి పర్వదినంను పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని హుడా ట్రేడ్ సెంటర్ లో రామాలయం లో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ శ్రీరామ నవమి పర్వదినాన ప్రజలు అందరూ సుఖశాంతులతో గడపాలని ఆకాంక్షించారు. శ్రీ సీతారాముల వారి కృపా కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, స్వామి వారి కృప ప్రజలందరి పై ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.






