బీసీలందరూ ఏకం కావాలి: బేరి రామచంద్ర యాదవ్

శేరిలింగంపల్లి, డిసెంబ‌ర్ 27 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): బీసీ వేదిక ఉపాధ్యక్షుడు సురేందర్ ఆధ్వర్యంలో గోపనపల్లి బిసి కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వ‌హించారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ బీసీలందరూ ఏకం కావాలని అన్నారు. సర్పంచ్ ఎలక్షన్లలో 50 శాతం మనం గెలిచామని, జనరల్ స్థానాల్లో కూడా పోటీ చేయాలని అన్నారు. అధికారం హస్తగతం చేసుకోవాలని, దానికి అందరూ మన ఓటు మనం వేసుకోవాల‌ని అన్నారు. మన అభ్యర్థులకి ఓటు వేయాల‌ని, ఐక్యమత్యంతో మెలగాలని కార్యకర్తలకు తెలిపారు. బీసీలకు న్యాయం జరగాలంటే అధికారం ముఖ్యమ‌ని, విద్య వైద్యం ఉపాధి అన్నింటా న్యాయం సాధించాలంటే ఎమ్మెల్యే ఎంపీగా మనల్ని గెలిపించుకోవాల‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ హరికృష్ణ చారి, నేషనల్ ఓబీసీ ఉపాధ్యక్షుడు కిరణ్, ఓ బి సి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివ ముదిరాజ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here