నేతాజీ నగర్‌లో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నల్లగండ్ల నేతాజీ నగర్ కాలనీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్న స్థానికులకు ఊరట లభించింది. కాలనీ అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ చొరవతో జలమండలి అధికారులు సమస్యను పరిష్కరించారు. కాలనీలోని అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నుంచి మురుగునీరు ఇళ్లలోకి వస్తుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన కాలనీ అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ జలమండలి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సూపర్‌వైజర్ సురేష్‌కు సమస్యను వివరించి, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

దీంతో స్పందించిన జలమండలి అధికారులు సిబ్బందిని కాలనీకి పంపించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించారు. పనులు జరుగుతున్న సమయంలో కాలనీ అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్, అసోసియేషన్ సభ్యులు శంకర్ నాయక్, దశరథ్ నాయక్, గణేష్ నాయక్, రాంబాబు నాయక్ దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. సమస్యను పరిష్కరించేందుకు సహకరించిన జలమండలి అధికారులకు, సిబ్బందికి కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here