శేరిలింగంపల్లి, డిసెంబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా నూతన పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షుడు శంకరోళ్ల సురేష్ ముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గుల్ల వాసుకి, శేరిలింగంపల్లి డివిజన్ ప్రెసిడెంట్ సంగమ్మ, జితేందర్ ముదిరాజ్, తబస్సు బేగం, సజీదా బేగం, పరశురాములు, శ్రీనివాస్ తదితర ముఖ్య నాయకులు పాల్గొని పూజలను నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బండారి రమేష్ యాదవ్ ని రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియమించడంపై పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, జిల్లా స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని అన్నారు.ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మియాపూర్ జాతీయ రహదారి ఆల్విన్ X రోడ్లో జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ శుభదినాన పూజా కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మరి కొద్ది రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా సౌకర్యాలతో సిద్ధం చేసి, TRP పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంచార్జి సుధగాని హరిశంకర్ గౌడ్ చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభోత్సవం నిర్వహిస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని, రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై మరింత బలంగా పోరాడతామని TRP నాయకత్వం స్పష్టం చేసింది.





