సాయినగర్ అంగన్ వాడీ కేంద్రంలో ప్రహరీ గోడతో నూతన భవన‌ నిర్మాణం చేయాలి : కైతాపురం జితేందర్

శేరిలింగంపల్లి, డిసెంబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో హఫీజ్ పేట్ డివిజన్ సాయి నగర్ బస్తీలోని అంగన్ వాడీ కేంద్రాన్ని సందర్శించి వివిధ సమస్యల వివరాలను సేకరించారు. ఈ సందర్బంగా కైతాపురం జితేందర్ మాట్లాడుతూ సాయినగర్ బస్తీలో అంగన్‌వాడీ కేంద్రాన్ని కిర్బీ షీట్లతో రూమ్ ఏర్పాటు చేసి వదిలేశార‌ని, కరెంట్ వసతి లేక ఎండ వేడికి ఉబ్బరంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నార‌ని, వాష్ రూమ్ లు లేవ‌ని, అంగన్ వాడీ కేంద్రం ఎదుట‌ మస్కా కుంట చెరువు ఉండడం, ప్రహరీ గోడ లేక పోవడం ప్రమాదకరంగా ఉన్నద‌ని, మస్కా కుంట చెరువు మొత్తం చెత్త, బురదతో ఆ ప్రాంతం దుర్వాసనతో ఉన్నద‌ని, చెరువు వద్ద పరిశుభ్రత పాటించకపోవడం , అక్కడ కనీస వసతులు లేక చాలా ఇబ్బందిగా ఉంటున్నార‌ని అన్నారు. క‌నుక అంగన్ వాడీ కేంద్రం ఉన్న స్థలాన్ని ప్రభుత్వం ప్రహరీ గోడతో నూతన భవనం నిర్మించాలని, స్థలం అన్యాక్రాంతం కాకుండా చూడాల‌ని అన్నారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ మాజీ అధికార ప్రతినిధి అజిత్ సేనాపతి , బీజేపీ జిల్లా గీతా సెల్ కన్వీనర్ రవి గౌడ్ , హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి జగన్ గౌడ్, డివిజన్ బీజేపీ కార్యదర్శి సుబ్బారావు , డివిజన్ బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్ , డివిజన్ బీజేవైఎం ప్రధాన కార్యదర్శి బాలరాజు , బీజేపీ నాయకులు శ్రీకాంత్ , కార్తీక్ , లోకేష్ , నిఖిల్ , నాగరాజు, స్థానిక బస్తీ వాసులు , మహిళలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here