శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 106వ డివిజన్ నెహ్రూ నగర్‌లో మన బస్తీ బాట 4వ రోజు కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మారబోయిన రవి యాదవ్ ఉదయం 7 గంటలకు నెహ్రూ నగర్ చేరుకుని వీధి వీధిగా ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా విన్నారు. తాగునీటికి సమస్యగా ఉందని, 4, 5 రోజులకు ఒకసారి నీరు వస్తుందని, అన్ని ప్రాంతాలలో డ్రైనేజీ సమస్యలు తీవ్రమైన స్థితిలో ఉన్నాయని, విద్యుత్ స్తంభాలపై దీపాల లోపం, రోడ్లపై నిరంతరం మంజీరా నీరు ప్రవహించడం, పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు నడక సమస్య, అశుభ్రత వల్ల దోమలు, ఆరోగ్య సమస్యలు, ప్రాథమిక మౌలిక సదుపాయాలు పూర్తిగా లేవని స్థానికులు రవి యాదవ్ కు తెలిపారు.

ఈ సందర్భంగా రవియాదవ్ మాట్లాడుతూ స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని అన్నారు. ప్రజల అవసరాల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చూపిస్తున్నారని అన్నారు. ఈ సమస్యలన్నింటినీ త్వరితగతిన పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కే.ఎన్.రాములు, మల్లేష్ ముదిరాజ్, స్వామీనాథ్, వెంకటరెడ్డి, వెంకట చారీ, శ్రీకాంత్ యాదవ్, గడ్డం శ్రీనివాస్, సురేష్ యాదవ్, గంగాధర్ గౌడ్, కొండకల శ్రీనివాస్, నవీన్ గౌడ్, సాయి నందన్ ముదిరాజ్, పవన్, స్వామి, రాజు గౌడ్, వడ్డే శ్రీనివాస్, జంగయ్య, బాలరాజు, శంకర్, మున్నా, రాజు గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, వెంకట్, కృష్ణ, నర్సింహా, మొహమ్మద్, దివ్య, నిరూప, నాగమణి, అనిత పాల్గొన్నారు.





