బీసీ రక్షణ చట్టం చేయాలి.. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ డిమాండ్..

శేరిలింగంపల్లి, జ‌న‌వ‌రి 8 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): భారతదేశంలోనే అత్యధిక బీసీ జనాభా కలిగిన రాష్ట్రం తెలంగాణనే అని, త‌క్షణమే బీసీ రక్షణ చట్టం రూపొందించాలని, రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలని, లేకపోతే రాజ్యాంగ ఆత్మ ఘోషిస్తుందని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశాన్ని బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ అధ్యక్షతన నిర్వ‌హించ‌గా మాజీ ఐఏఎస్ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బీసీలపై అక్రమ దాడులు చేస్తూ వివక్షతకు గురి చేస్తున్న అగ్రకులాలపై బీసీ రక్షణ చట్టం రూపొందించి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామ‌ని అన్నారు. 42% బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చిన తర్వాతే మునిసిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామ‌ని అన్నారు. లేనిపక్షంలో రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ ఎస్ దుర్గయ్య గౌడ్ , రాష్ట్ర కన్వీనర్లు బైరు శేఖర్ గంగపుత్ర, అంబాల నారాయణ గౌడ్ , యెలికట్టె విజయకుమార్ గౌడ్, ఎర్రమాదు వెంకన్న నేత, గనం నరసింహ కుర్మ, గోలి యాదగిరి రజక, పొన్నం దేవరాజ్ గౌడ్, బీసీ న్యాయవాదులు జేఏసీ చైర్మన్, చెన్న శ్రీకాంత్ నేత, సురేష్ ఆనంద్, శంకర్ గంగపుత్ర, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here