శేరిలింగంపల్లి, ఆగస్టు 2 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్ సర్కిల్‌లో నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమంలో భాగంగా మొత్తం 7 దరఖాస్తులను స్వీకరించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో 4, రెవెన్యూ విభాగంలో 2, హెల్త్ అండ్ శానిటేషన్‌లో 1 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. యూసీడీ. వింగ్, ఇంజినీరింగ్ వింగ్, యూబీడీ, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఎలాంటి ఫిర్యాదులు రాలేదని వివరించారు. ప్రజావాణిలో వచ్చిన వినతులను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు.






