మియాపూర్ స‌ర్కిల్ ప్ర‌జావాణికి 6 ఫిర్యాదులు

శేరిలింగంప‌ల్లి, మే 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని మియాపూర్ స‌ర్కిల్ కార్యాల‌యంలో సోమ‌వారం ప్ర‌జావాణి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. డీసీ శ‌శిరేఖ ఇందులో పాల్గొని ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన ఫిర్యాదుల‌ను స్వీక‌రించారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి 2 ఫిర్యాదులు అంద‌గా, ఇంజినీరింగ్ వింగ్‌కు 4 మొత్తం క‌లిపి 6 ఫిర్యాదులు వ‌చ్చిన‌ట్లు తెలిపారు. ఆయా ఫిర్యాదుల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని సంబంధిత విభాగాల‌కు చెందిన అధికారులు, సిబ్బందికి డీసీ శ‌శిరేఖ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here