బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను వెంట‌నే అమ‌లు చేయాలి: బీసీ జర్నలిస్ట్ అసోసియేషన్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బీసీ రిజర్వేషన్ల‌ను వెంటనే అమలు చేయాలని బీసీ జర్నలిస్ట్ అసోసియేషన్ (జేఏసీ) సభ్యులు తొట్ల పరమేష్, కొహీర్ నాగరాజు, దాదే వెంకట్ తేళ్ల హరికృష్ణలు డిమాండ్ చేశారు. తెలంగాణ లో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్ల కోసం విడుదల చేసిన జీవోకు చట్టబద్ధత కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని కోరుతూ శనివారం చేపట్టిన బీసీ బంద్ కార్యక్రమంలో భాగంగా కేపీహెచ్ బీ రోడ్ నెంబర్ వన్ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో జీవో నంబరు 9 ను విడుదల చేసి ఎన్నికలకు సిద్దం కాగా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చట్టబద్ధత కల్పించకుండా తాత్సారం చేస్తుందని విమర్శించారు. తెలంగాణలో బీసీ వర్గాల సంక్షేమం కోసం జర్నలిస్టులు ఫ్రంట్ లైన్‌లో పనిచేసి సాధించిన విజయాల‌ను గుర్తించాలన్నారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ సాధనానికి కూడా ఇదే కృషి కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో జర్నలిస్ట్ లు నవీన్, నామాల శ్రీధర్, శ్రీకాంత్, భాస్కర్ చారి, శ్రీకాంత్, గాదె లక్ష్మణ్ గౌడ్, కిషోర్ నరసింహ, శంకర్, గోపీ కురుమ చంద్రశేఖర్, రాము, హరి, వెంకటేష్ నాగరాజు , హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here