నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని ఆనంద్ నగర్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ పాదయాత్ర చేశారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. వెంటనే చేపట్టాల్సిన పనులను ప్రారంభించి త్వరతగతిన పూర్తి చేస్తామని కాలనీ వాసులకు కార్పొరేటర్ హమీద్ పటేల్ హామీ ఇచ్చారు. సీనియర్ నాయకులు జంగంగౌడ్, కచ్చావా దీపక్, రంగయ్య, వహీద్ ఖాన్, యూసఫ్, మొహ్మద్ ఖుదబుద్దీన్, సయ్యద్ నాయిముద్దీన్, షేక్ అలీ, మొహ్మద్ ఉస్మాన్, సరోజ, నిరంజన్, పి. సత్య, వెంకటేష్, బి. శ్రీధర్, కావ్య, ఇక్బాల్, తదితరులు ఉన్నారు.