శ్రీ కృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ సెంటర్ – ప్రారంభించిన గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సినేషన్ వేసుకోవాలని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని మధుర నగర్ లోని బస్తీ దవాఖాన లో శ్రీ కృష్ణ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు అభిషేక్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ సెంటర్ ను స్థానిక కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో 500 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం రాని వారికి ఈ వ్యాక్సినేషన్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గోపనపల్లి తండా వడ్డెర సంఘం ప్రెసిడెంట్ అలకుంట శ్రీరామ్, గచ్చిబౌలి డివిజన్ ఐటీ సెల్ కన్వీనర్ రాఘవేంద్ర, సీనియర్ నాయకురాలు వరలక్ష్మి, సీనియర్ నాయకులు నర్సింగ్ నాయక్, ప్రకాష్, కోవూరు సంగమేష్, రాకేష్, దేవేందర్, మనీష్, అన్సారీ, సాయి, బాలు, నర్సింహా గౌడ్, నవీన్, గిరిధర్, నరసింహ గౌడ్, హరి కృష్ణ గౌడ్, స్థానిక నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

అక్షయ సెంటర్ వారి సహకారంతో నిత్యావసర సరుకులను అందజేస్తున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here