నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని యూత్ కాలనీ లో పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి ఎమ్మెల్యే గాంధీ పాదయాత్ర చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని అన్నారు. సంతులిత , సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. యూత్ కాలనీలో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీకాంతిని, డీఈ విశాలాక్షి, ఏఈ ప్రతాప్, హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు సయ్యద్ తయ్యార్ హుస్సేన్, షేక్ సాబేర్, సుదేశ్, షేక్ కలిల్, షేక్ జామీర్, షేక్ చంద్ పాషా, మహమ్మద్ జఫ్ఫార్, షేక్ జకీర్, సయ్యద్ ఇమ్రాన్, మహమ్మద్ తసీన్, నాయీమ్, గౌస్, మహిళలు షబాన, నజియా, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
