నమస్తే శేరిలింగంపల్లి: అందరి సమిష్టి కృషితోనే ప్రజలకు వైద్య సేవలందిస్తూ రెండేళ్లు పూర్తి చేసుకోవడం సంతోషకరమని పీఆర్ కే ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ పుట్టా రవికుమార్ అన్నారు. పీఆర్ కే ఆస్పత్రి రెండో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆస్పత్రి సిబ్బందితో కలిసి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పుట్టా రవి కుమార్ కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా రవి కుమార్ మాట్లాడుతూ ఆస్పత్రి ప్రారంభించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడంలో సిబ్బంది సమిష్టి కృషి అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ లో ప్రత్యేల ప్యాకేజీ ధరలలో కార్డియాలజీ, యూరాలజీ, ఉచిత న్యూరో కన్సల్టేషన్ సహా ఇన్వెస్టిగేషన్స్ లో డిస్కౌంట్ ఇవ్వటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మేనేజ్‌మెంట్ టీమ్, కన్సల్టెంట్ డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, మార్కెటింగ్ టీమ్, అడ్మినిస్ట్రేషన్ టీమ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.