బండి సంజయ్ అరెస్టు పట్ల బిజెపి నాయకుల నిరసన

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం‌ రాక్షస పాలన కొనసాగిస్తుందని, దీక్ష చేస్తున్న బిజెపి నాయకులను జైలుకు పంపడం దారుణమని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పోరెడ్డి బుచ్చిరెడ్డి, బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు రాచమళ్ల నాగేశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్షకు వచ్చిన కార్యకర్తలపై, నాయకులపై రాక్షసంగా ప్రవర్తిస్తూ అక్రమ అరెస్టులు చేసిన కరీంనగర్ సీపీ, పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తూ బిజెపి శేరిలింగంపల్లి అసెంబ్లీ నాయకులు చందానగర్ లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.‌ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నం 317 ని సవరణ చేయాలి, ఉద్యోగుల బదిలీల విషయంలో అన్ని ఉద్యోగ సంఘాల మద్దతుతో జనజాగరణ దీక్ష చేస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ను అక్రమంగా అరెస్టు చేసి బిజెపి నాయకులపై లాఠీ ఛార్జీ చేయడం పట్ల ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మారం వెంకట్, డివిజన్ అధ్యక్షులు గొల్లపల్లి రాంరెడ్డి, ఆంజనేయులు, మాణిక్యరావు, శ్రీధర్ రావు, జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీశైలం కురుమ, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి నర్సింహా రావు, బిజెపి నాయకులు హరికృష్ణ, నారాయణరెడ్డి, రాకేష్ దూబే, శాంతి భూషణ్ రెడ్డి, రవి గౌడ్ , భారత్ రాజ్, రెడ్డి ప్రసాద్, ఆకుల లక్ష్మణ్, శ్రీనివాస్ ముదిరాజ్, సత్య, రామకృష్ణ, శ్రీనివాస్ గుప్తా, సత్యం గుప్తా, శ్రీధర్ రెడ్డి, గణేష్ ముదిరాజ్, చంద్రమౌళి గౌడ్ మరియు ఇతరులు పాల్గొన్నారు.

చందానగర్ లో నిరసన తెలుపుతున్న బిజెపి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here