శేరిలింగంపల్లి, ఏప్రిల్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ఆధ్వర్యంలో మినిమం వేజ్ బోర్డ్ మాజీ చైర్మన్ సామ వెంకట్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి బీఆర్ఎస్ జెండాను ఎగుర వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ శర్మ, శ్రీకాంత్, రాజన్న, సలీం, చందర్ రావు, గౌస్, రామారావు, బాబా, దివ్య రెడ్డి, సునీత, ప్రమోద్, సగేష్ రెడ్డి, శ్రీనివాస్, శివ శంకర, ఇబ్రహీం, అనంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






