అల్లూరి సీతారామరాజుకు మొవ్వా ఘన నివాళి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ లో ఉషా ముళ్ళపూడి కమాన్ వద్ద అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు కెవైఎఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ వీచ్చేసి ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు.

 

ఈ సందర్బంగా మొవ్వా సత్యనారాయణ మాట్లాడుతూ.. తెల్ల దొరల గుండెల్లో గుబులు పుట్టించిన యోధుడు, భారత స్వాతంత్ర చరిత్రలో శాశ్వత కీర్తి సాధించిన వీరుడు అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు అల్లూరి సీతారామరాజు అభిమానులు పాల్గొన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here