అల్లూరి విప్లవ , దేశభక్తి భావజాలాన్ని ప్రతి యువత అలవర్చుకోవాలి:

  • బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శ బండి రమేష్

నమస్తే శేరిలింగంపల్లి: చిన్న వయసులో విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారని, ఆ భావజాలాన్ని నేటి యువత అలవర్చుకోవాలని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శ బండి రమేష్ పిలుపునిచ్చారు.

మంగళవారం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శ బండి రమేష్ మాట్లాడుతూ చిన్న వయసులోనే అల్లూరి సీతారామరాజు దేశ పరిస్థితులను అధ్యయనం చేసి అనేక ప్రదేశాల్లో తిరిగి ప్రజలు పడుతున్న కష్టాలను ఆకలింపు చేసుకుని ముఖ్యంగా గిరిజనులు పడుతున్న కష్టాలు గిరిజనులపై బ్రిటిష్ ముష్కర లు చేస్తున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని ఎంచుకుని బ్రిటిష్ వారిని గడగడ లాడించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మల్లికార్జున శర్మ, గంగారం సంగారెడ్డి, నర్సింగ్ రావు, తెప్ప బాలరాజు ముదిరాజ్ ,శేఖర్ గౌడ్ , కాకర్ల అరుణ, సత్యారెడ్డి , అంజద్ అమ్ము, రవణ, సత్తయ్య , ఉమేష్ బిఆర్ యువసేన పాల్గొన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here