ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి: బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

  • గచ్చిబౌలి డివిజన్, దర్గా నుంచి బీజేపీలో చేరిన యువకులు, స్థానిక కాలనీ వాసులు
బీఆర్ఎస్ నాయకులు పనితీరుపై మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : బీజేపీ పార్టీ యువకుల నుంచి వస్తున్న ఆదరణతో దూసుకుపోతున్నది. గచ్చిబౌలి డివిజన్, దర్గా నుండి సామ్రాట్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో యువకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్. అనంతరం మాట్లాడుతూ బీఆర్ ఎస్ నాయుకులు మౌలిక వసతుల కల్పనలో, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని, ప్రజలను ప్రజా సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఈ ప్రాంతానికి మాకు చాలా అనుబంధం ఉందని, మనం కష్టపడి గంగాధర్ రెడ్డి ని గెలిపించుకున్నామని , ఏ పని కావాలన్న ప్రభుత్వంతో కొట్లాడి అరకొర పనులను చేపించుకొగలుగుతున్నామని పేర్కొన్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ని గెలిపించుకుని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తకు అండగా తాను ఉంటానని భరోసా కల్పించారు. పార్టీలో చేరిన వారిలో నరేందర్ చారి, రాజేష్ గౌడ్, శివ ముదిరాజ్, శరత్ , శివా రెడ్డి, సర్దార్, రాజేష్ యాదవ్ అతడి సహచరులు ఉన్నారు. కార్యక్రమంలో రాధాకృష్ణ యాదవ్, ఎల్లేష్, శ్రీనివాస్ చారి, నరేందర్ గౌడ్, జితేందర్ కృష్ణ యాదవ్, శ్యామ్ యాదవ్, సాయి, అమర్ యాదవ్, కరణ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.

పార్టీలో చేరిన యువకులతో..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here