ఆదుకోకుంటే ఆత్మార్పణే..

  • టిఆర్ఎస్ కోసం ఎంతో చేశాం.. ఇప్పుడు దూరం పెడుతున్నరు
  • పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్నాం.. ఇలాగే కొనసాగితే తాము బతకలేం
  • పార్టీ ప్రచారం కోసం గల్లీ గల్లీ తిరిగిన తన గులాబీ రథం మూలన పడిందని ఆవేదన
  • మంత్రి కేటీఆర్ ఆదుకోవాలని తెలంగాణ మలిదశ ఉద్యమ కారుడు, బిఆర్ ఎస్ కార్యకర్త ఆశిల శివ వేడుకోలు

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ ఆత్మగౌరవం అంటే.. ఒక కార్యకర్త ఆత్మ గౌరవం అని, ఉద్యమకారులంటే దూరం పెడుతున్నారని తెలంగాణ మలిదశ ఉద్యమ కారుడు, బిఆర్ ఎస్ కార్యకర్త ఆశిల శివ ఆవేదన వ్యక్తం చేశారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గం 2007 నుంచి బిఆర్ ఎస్ లో కొనసాగుతున్నానని, పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొన్నానని, తన తెలంగాణ స్కూటర్ రథంపై పలు జిల్లాలలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలో పాలుపంచుకున్నట్లు తెలిపాడు.

ఆనాడు ఉద్యమంలో , ప్రతి ఒక్క ఎలక్షన్స్ లో సొంత డబ్బులతో కార్యక్రమాలు చేపట్టాను కానీ ఈరోజు శేరిలింగంపల్లిలో తమకు గుర్తింపు లేకుండా పోయిందని, ఉద్యమకారులు అనగానే దూరం పెట్టేస్తున్నారని, ఏ ఒక్క కార్యక్రమానికి తమను పిలవడం లేదని, అప్పుడు టిఆర్ఎస్ ఇప్పుడు బి ఆర్ఎస్ లో తమకు సరియైన గుర్తింపు లేదని తన గోడు వెలిబుచ్చారు.

ముగ్గురు అన్నదమ్ములం పార్టీ కోసమే పనిచేశామని, ఎన్నో ఆస్తులు పోగొట్టుకున్నామని, కాని ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్న డబుల్ బెడ్ కూడా లేదని, అద్దె ఇంట్లో ఉంటూ అవస్థలు పడుతున్నామని, ఆనాడు ఎన్నో జిల్లాలలో ప్రచారం కోసం గల్లి గల్లి తిరిగిన తన గులాబీ స్కూటర్ నేడు మూలాన పడిందని, పట్టించుకునే నాథుడే కరువయ్యాడని మనోవేదనకు గురయ్యారు.

తెలంగాణ వచ్చిందని బాధపడాలో.. సంతోషపడాలో తెలియని స్థితిలో తమ కుటుంబం ఉన్నదని, ఆదుకోవాలని, తమకు న్యాయం చేసి తమ కుటుంబాన్ని నిలబెట్టాలని వేడుకున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కొండపాక గ్రామం సిద్దిపేట వాసులమై ఉంది కూడా ఏమి చేయలేకపోతున్నామన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తమ ప్రాణాలు బిఆర్ ఎస్ పార్టీకి అంకితం ఇస్తామని, మంత్రి కేటీఆర్ స్పందించి తగిన న్యాయం చేయాలన్నారు. టీఆర్ఎస్ కోసం తమ ప్రాణాలు సైతం ఇవ్వడానికి వెనుకాడమని, ఇక్కడే కొట్లాడుతాం.. ఇక్కడే చస్తాం.. జై తెలంగాణ జై కేసీఆర్ జై బి ఆర్ఎస్ అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here