నమస్తే శేరిలింగంపల్లి: మూడు రోజులుగా చందానగర్ డివిజన్ వేముకుంటవాసులు తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొన్ని మరమ్మతుల కారణంగా చందానగర్ డివిజన్ వెంకుంటలో మంచి నీటి సరఫరా ఆగిపోయింది. స్థానిక కార్పొరేటర్ కంటెస్టెంట్ అలీ చెప్పడంతో బస్తి వాసులకు టీపీసీసీ జనరల్ సెక్రటరీ జేరిపేటి జైపాల్ తన సొంత ఖర్చుతో చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచినీటి సరఫరా అందించారు.