సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురు బాధితులు సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా.. సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.3 లక్షల 4 వేలు మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సహాయానికి సంబందించిన చెక్కులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబాలకి అందజేశారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీకి చెందిన చక్రధర్ రావుకి రూ. 28 వేలు, గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని కేశవ నగర్ కి చెందిన కృష్ణవేణికి రూ. 40 వేలు, కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని ఆస్బె స్టాస్ కాలనీకి చెందిన మహ్మద్ అక్బర్ కు రూ. 28 వేలు, వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని రామకృష్ణ నగర్ కి చెందిన నాగప్రశాంత్ కి రూ. 28 వేలు, ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండకి చెందిన పదం సింగ్ కి రూ. 65 వేలు, ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంశిగుడకి చెందిన ఎలేంద్రకికి రూ. 24 వేలు, ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని PJR నగర్ కి చెందిన ఉమారాణికి రూ. 40వేలు మంజూరు కాగా.. వారికి చెక్కులు పంపిణి చేశామని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తెలిపారు. అనారోగ్యానికి గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మాధవరం రంగరావు, రవీందర్ ముదిరాజు, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, బీఆర్ ఎస్ నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు, కాశీనాథ్ యాదవ్, అనిల్, లింగం పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణి చేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here