నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్, మాధవ హిల్స్, అంజయ్య నగర్, సిద్దిక్ నగర్, బంజారా నగర్, రాజీవ్ నగర్ వడ్డర బస్తీ, ఓల్డ్ పీజేఆర్ నగర్, మార్తాండ్ నగర్, హనీఫ్ కాలనీ, శ్రీనివాస కాలనీ, సఫారీ నగర్ కాలనీల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఇందులో భాగంగా స్థానిక నాయకులు, ప్రజలతో కలసి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం ప్రతి ఒక్కరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, మిఠాయిలు తినిపించారు.